Mobile Popup Ad
Mobile Popup Ad

బండి సంజయ్, రేవంత్ రెడ్డిలపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మీడియాలో సమావేశంలో ఆయన పోక్సో కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మైనర్ బాలికపై చేసిన అకృత్యం గురించి బండి సంజయ్ (Bandi Sanjay) గతంలో రేవంత్ రెడ్డికి స్వయంగా చెప్పారని ఆరోపించారు. అసలు బండి సంజయ్ ఆ రోజు రేవంత్ రెడ్డికి ఏం చెప్పారు, ఆ ఘటనపై అప్పటి డీజీపీకి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారో బహిరంగంగా వివరించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పోక్సో కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే తెలంగాణ ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>