కలం, డెస్క్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై హైకోర్టులో పిటిషన్ వేసిన బుట్టెంగారి మాధవరెడ్డి (Madhava Reddy) గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు మున్సిపల్ ఎన్నికల్లో షాక్ తగిలింది. బీఆర్ ఎస్ తరఫున పోటీ చేసిన మాధవరెడ్డి ఓటమి చెందారు. మేడ్చల్ నియోజకవవర్గంలోని మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో 10వ వార్డు కేశవాపూర్ బీఆర్ ఎస్ అభ్యర్థిగా మాధవరెడ్డి పోటీ చేశారు. ఆయన ఓటమిపై రకరకాల చర్చలు మొదలయ్యాయి.


