మేక పిల్ల కోసం బాలుడి సాహసం.. వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: బీహార్‌ (Bihar)లోని చంపారన్ జిల్లాలో మేక పిల్లను రక్షించడానికి ఒక బాలుడిని బావిలోకి దించిన ఘటన సంచలనం సృష్టించింది. గ్రామస్థులందరూ చూస్తుండగానే, బాలుడికి ఒక గుడ్డను గట్టిగా కట్టి తాళ్ల సాయంతో లోపలికి దించారు. బావి అడుగుకు చేరుకున్న ఆ బాలుడు మేక పిల్లను పట్టుకోగా, గ్రామస్థులు సురక్షితంగా పైకి లాగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) కావడంతో, బాలుడి ధైర్యాన్ని కొందరు మెచ్చుకోగా, ఒక మేక పిల్ల కోసం బాలుడి ప్రాణాలను పణంగా పెట్టడంపై మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్ తాలూకాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గోరఖ్ జాదవ్ అనే రైతు తన గోధుమ పంటకు నీళ్లు పెట్టి మధ్యాహ్నం భోజనం చేస్తుండగా, ఒక్కసారిగా చిరుత అతనిపై దాడి చేసింది. తనను తాను రక్షించుకోవడానికి జాదవ్ చేసిన పోరాటంలో చిరుతపులితో అతడు పక్కనే ఉన్న బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో రైతుతో పాటు చిరుతపులి కూడా ప్రాణాలు కోల్పోయింది.

Read Also : లిక్కర్ క్వీన్ TO క్లీన్ క్వీన్ : కవిత పొలిటికల్ గేమ్ చేంజ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>