Mobile Popup Ad
Mobile Popup Ad

బీచ్‌ల్లో బార్లు నడిపిస్తారా?.. బొత్స ఫైర్

కలం, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వం ఏపీ బీచ్‌ల్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మండిపడ్డారు. ఈ మేరకు విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏపీ బీచ్‌ల్లో మద్యం అమ్మకాల నిర్ణయాన్ని తప్పుబట్టారు. బీచ్‌ల్లో బార్లు నడిపిస్తారా? అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. పర్యాటక రంగం అభివృద్ధి ముసుగులో కూటమి ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతుందని ఫైర్ అయ్యారు. ఆంధ్రాలో ఏంటీ కల్చర్?.. ప్రభుత్వ నిర్ణయానికి ఏడవాలో, నవ్వాలో, బాధపడాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

లోకేష్ కు అందుకే విద్యాశాఖ అప్పగించారా?

పాఠశాలలు ప్రారంభం నాటికే తాము పేద పిల్లలకు బూట్లు, పుస్తకాలు, బట్టలు, బ్యాగ్ ఇచ్చేవాళ్లమని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే విద్యాశాఖను చెడగొట్టాలని లోకేశ్‌కు ఆ శాఖను అప్పగించారా? అని ప్రశ్నించారు. లోకేశ్ ఛాలెంజ్‌లు దేనికి విద్యాశాఖను బాగు చేయ్యడానికా? నాశనం చెయ్యడానికా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. డీఎస్సీని నిర్వహించలేదని అసమర్థ ప్రభుత్వం ఇది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పవన్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని చెప్పారు. రెండేళ్ల పాలన పై నిర్వహించిన సభలో ఏపీ గురించి పవన్ మాట్లాడరు.. కానీ తెలంగాణ గురించి మాత్రం మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే దమ్ముందా? అని సవాల్ చేశారు. కూటమి పాలనపై నేరుగా జనం ఇళ్లకే వెళ్లి అడుగుదామని ఛాలెంజ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>