కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో (AP Council) మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శాసనమండలి సమావేశాల్లో మాట్లాడుతుండగానే బొత్స తూలి కిందపడబోయారు. తోటి సభ్యులు ఆయననను పట్టుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అసెంబ్లీ అధికారులు అత్యవసరంగా వైద్యులను పిలిపించారు. వైద్యులు శాసనమండలి భవనంలోని బొత్స సత్యనారాయణ ఛాంబర్‌కే చేరుకుని ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు (బీపీ)లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండటం వల్లనే ఆయనకు అస్వస్థత ఏర్పడినట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. వైద్యుల సూచనల మేరకు కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ ఘటనతో శాసనమండలిలో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. అనంతరం బొత్స (Botsa Satyanarayana) ఆరోగ్యం సాధారణ స్థితికి రావడంతో సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: టీటీడీ భగవద్గీత పుస్తకాల ప్రచురణ వివాదం
Follow Us On : WhatsApp

