మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీలో ర‌క్త‌దాన శిబిరం

కలం, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University)లో ఎన్ఎస్ఎస్ విభాగం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉచిత రక్తదాన శిబిరాన్ని (Blood Donation Camp) నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేవలం పాఠ్య పుస్తకాల విద్యకే పరిమితం కాకుండా సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతీ విద్యార్థి సామాజిక స్పృహ, సమాజం పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరమని వివరించారు.

ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో విశ్వవిద్యాలయాని(Mahatma Gandhi University)కి చెందిన పలువురు విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. మొత్తం 42 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందించినట్లు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకట రమణారెడ్డి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య విజయ్ బాబులతో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ షరీఫ్, డాక్టర్ ఆనంద్, డాక్టర్ కిరణ్మయి, రమేష్ నాయక్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read : కలెక్టరేట్ వేదికగా రేవంత్ .. బండి సంజయ్ విభేదాల రచ్చ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>