సీఎం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష

కలం, నిర్మల్ : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సీఎం ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని, పైస్థాయిలో పరిష్కరించాల్సిన దరఖాస్తులను వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 9వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాలకు సంబంధించిన గోడప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఆర్వో రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>