Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: ఎమ్మెల్యే రామారావు పటేల్

కలం, నిర్మల్ : తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Rama Rao Patel) ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీకి అసలైన బలం నిబద్ధత కలిగిన కార్యకర్తలేనని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాలను కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయాలని సూచించారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యమవుతుందని అన్నారు. జిల్లా పార్టీ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఎన్నికలకు సిద్ధం కావాలని రామారావు పటేల సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>