ఓట్ల తొలగింపుపై పొన్నంకు రాంచందర్‌ రావు సవాల్

కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఅర్ ప్రక్రియతో ఈసీని అడ్డుపెట్టుకొని ఓట్ చోరీకి పాల్పడుతుందని ఇండి కూటమి చేస్తున్న ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు (Ramchander Rao) ఘాటుగా స్పందించారు. ఈ మేరకు కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆయన బహిరంగ సవాల్ విసిరారు. ఓట్లు తొలగించబడ్డాయని చెబుతున్న కనీసం 10 మందినైనా సీఈవో కార్యాలయానికి తీసుకురాగలరా? అని నిలదీశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడిందని.. అందుకే తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు ఇచ్చాం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ పాతికేళ్ల ప్రజాజీవితంలో ముఖ్యమంత్రిగా, ప్రధానిగా విశేషమైన సేవలందించారని రాంచందర్ రావు కొనియాడారు. గడచిన పన్నెండున్నరేళ్లుగా తెలంగాణకు సుమారు రూ. 13 లక్షల కోట్లు ఇచ్చి, అభివృద్ధిలో ముందునిలిపారని అన్నారు.  గతంలో కాంగ్రెస్ హయాంలో భారత్ అన్నిరంగాల్లో కుదేలై ఉండేదని విమర్శించారు. ప్రధానిగా పాలన చేపట్టిన మోదీ దేశాన్ని బహుముఖ రంగాల్లో ముందుకు నడిపించారని అన్నారు.

41వేల రైల్వే స్టేషన్ల ఆధునీకరణ..

కేంద్ర సహకారంతో వరంగల్ విమానాశ్రయం, ఆదిలాబాద్ లో రక్షణరంగ విమానాశ్రయం ఏర్పాటు అవుతున్నాయని రాంచందర్ రావు చెప్పారు. దేశంలో 41వేల రైల్వే స్టేషన్లను కేంద్రం ఆధునీకరిస్తోందని తెలిపారు. నక్సలిజం రూపుమాపే దిశగా కేంద్రం వినూత్న అడుగులు వేసిందన్నారు. ‘నాగరిక్ దేవో భవ’ అనే స్ఫూర్తితో భారతమాత సేవకు మోదీ అంకితభావంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

నేరుగా సుప్రీం న్యాయమూర్తిని కలిసేవీలుందా?

ఎల్ నినోతో తెలంగాణ  రైతాంగం కరువు కోరల్లో చిక్కుకుంటే.. రాష్ట్ర మంత్రివర్గం మాత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ టూర్లకు వెళ్లిందని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కరువుపై పట్టింపులేదని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ రద్దు చేసుకుని. పిచ్చితుగ్లక్ వంటి రాహుల్ మాటలు విని ఆగమేఘాలమీద ఢిల్లీకి  ఇక్కడి కాంగ్రెస్ నేతలు వెళ్లారని విమర్శించారు. ఎవరైనా నేరుగా సుప్రీం న్యాయమూర్తిని కలిసేవీలుందా? న్యాయవాదులపై నమ్మకం లేదా?  అని ప్రశ్నించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>