పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ వ్యూహరచన.. నేడు కీలక భేటీ

కలం, వెబ్ డెస్క్ : సోమవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగు రోజుల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అప్రమత్తమైంది. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం (Congress Meeting) కానుంది.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన ఈ కీలక భేటీ జరగనుంది. ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే, సభలో విపక్షాలన్నీ సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉమ్మడి కార్యాచరణను రూపొందించే అంశంపై కూడా ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>