అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం.. ఎమ్మెల్యే కాటిపల్లి సంచలన వ్యాఖ్యలు

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) డిగ్రీ కాలేజీ భూముల విషయంలో అక్రమాలకు అవినీతికి పాల్పడ్డట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (MLA Katipally) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కామారెడ్డి కలెక్టరేట్‌కు వస్తానని, కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే తన తప్పును అక్కడే నిరూపించాలని సవాల్ విసిరారు. కామారెడ్డి అభివృద్ధి కోసం తాను నిధులు తీసుకొస్తే.. ఇన్‌చార్జి మంత్రి షబ్బీర్ అలీ ఆ క్రెడిట్‌ను కొట్టేన్నారని ఆరోపించారు. పైసా తీసుకురాని షబ్బీర్ అలీ ఈ ఏరియాకు నవాబులా మారాడని మండిపడ్డారు. ప్రభుత్వ కళాశాలకు చెందిన భూములను లీజుకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కళాశాలకు కిరాయిలు వస్తున్నాయని, ఈ విషయమై కాంగ్రెస్ నేతలతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే, తన క్యాంపు ఆఫీస్ పై దాడికి యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాంతి భద్రతల దృష్ట్యా తాను బయటకు రాలేదని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ (Congress) నేతల ఆగడాలను భరించానని, ఇక నుంచి భరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తాను తెలంగాణ యూనివర్సిటీని కామారెడ్డిలో ఏర్పాటుచేసేందుకు చొరవ చూపానని గుర్తుచేశారు. తన కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిరూపించేదాకా ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే (MLA Katipally) స్పష్టం చేశారు.

Read Also: రేపు వరంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>