కలం, నిర్మల్: భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా (BJP Minority Morcha) నూతన కమిటీలను ఇటీవల జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన కమిటీ సభ్యులను(New Committee Members) ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు సర్దార్ గురుదీప్ సింగ్ నేతృత్వంలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. మైనారిటీ మోర్చా కార్యకలాపాలను మరింత విస్తృతం చేసి, ప్రజలకు పార్టీ విధానాలను చేరువ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మైనారిటీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

