హైదరాబాద్‌లో ఫ్లెక్సీల రగడ: ఎంఐఎం బ్యానర్లు చించేసిన మాధవీలత!

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్‌లో రంజాన్ మాసం వేళ రాజకీయాల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రి (Virinchi Hospitals) ఎదుట ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపీ నేత మాధవీలత (Madhavi Latha) చించివేయడం నగరంలో కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంఐఎం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రంజాన్ ఇఫ్తార్ విందు అంటే ఏసీ గదుల్లో, ఫంక్షన్ హాళ్లలో ధనవంతులకు ఇచ్చే విందులు కావని ఆమె పేర్కొన్నారు. రంజాన్ పవిత్రతను, దాని అంతరార్థాన్ని ఎంఐఎం నేతలు పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు.

నిజమైన ఇఫ్తార్ (Iftar) విందులు అనాథ ఆశ్రమాల్లో ఉన్న అభాగ్యులకు, తిండికి నోచుకోని అసలైన పేదలకు అందించాలని మాధవీలత సూచించారు. కేవలం ఆడంబరాల కోసం, రాజకీయ ప్రదర్శనల కోసం చేసే విందులు రంజాన్ స్ఫూర్తికి ఏమాత్రం తగవని ఆమె తెలిపారు. రంజాన్ మాసం విశిష్టత ఏమిటో, అసలైన ఇఫ్తార్ అంటే ఏమిటో ఎంఐఎం నేతలు తెలుసుకోవాలని ఆమె (Madhavi Latha) పేర్కొన్నారు.

Read Also: ప్ర‌కృతి సేద్యంతో అద్భుతాలు.. గుంటూరు రైతుకు సీఎం ప్ర‌శంస‌లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>