Mobile Popup Ad
Mobile Popup Ad

భూపాలపల్లిలో భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

కలం, భూపాలపల్లి: భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు సీసీఎస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఖాసింపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా అంబర్ (అనార్ బ్రాండ్) గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. ఆరు సంచుల్లో 1,200 ప్యాకెట్లు లభించగా, వాటి విలువ సుమారు రూ.1.92 లక్షలుగా అంచనా వేశారు. యూసుఫ్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ ఉంచడం, రవాణా చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని సీఐ రమేశ్ వివరించారు. ఇలా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>