epaper
Sunday, March 1, 2026
epaper

బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి: భూమన

క‌లం, వెబ్ డెస్క్‌: బీఆర్ నాయుడు (BR Naidu)కు ఏమాత్రం దైవ భ‌క్తి ఉన్నా త‌న టీటీడీ చైర్మ‌న్‌ (TTD Chairman) ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని వైసీపీ నాయ‌కుడు, మాజీ టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి (Bhumana Karunakar)డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు ఒక మ‌హిళ‌తో స‌న్నిహితంగా ఉన్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై భూమ‌న మీడియాతో మాట్లాడారు. టీటీడీ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వ్య‌క్తికి చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌న్నారు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న చేసిన ప‌నుల‌న్నీ ప్ర‌పంచ‌మంతా పాకిపోతున్నాయ‌న్నారు. ఈ వీడియోలు అంద‌రికీ ఎంతో బాధ క‌లిగిస్తున్నాయ‌ని చెప్పారు.

వేంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుడిని అని చెప్పుకునే సీఎం చంద్ర‌బాబు (Chandrababu) దీనిపై ఏం స‌మాధానం చెప్తార‌ని ప్ర‌శ్నించారు. ఈ వీడియోల‌తో ఆయ‌న బీఆర్ నాయుడు కాదు.. బీఆర్ కామ‌నాయుడు అని సోష‌ల్ మీడియా ఘోషిస్తోంద‌న్నారు. బీఆర్ నాయుడులో ఏమాత్రం అప‌రాధ భావం ఉన్నా ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్నారు. వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ్డందుకు వైసీపీ కుట్ర చేస్తుంద‌ని చెప్ప‌డం స‌రికాద‌న్నారు. స‌రిగ్గా 14 సంవ‌త్స‌రాల క్రితం ఈ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఎన్డీ తివారీ మీద ఆరోప‌ణ‌లు వ‌స్తే ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేసి ఉత్త‌రాఖండ్ వెళ్లిపోయార‌న్నారు. ఎస్వీబీసీ భ‌క్తి ఛానెల్‌లో వైసీపీ హ‌యాంలో అధ్య‌క్షుడిగా ఉన్న పృథ్వీ ఒక మ‌హిళ‌తో అస‌భ్యంగా మాట్లాడిన ఆడియో బ‌య‌ట‌కు రావ‌డంతో వెంట‌నే జ‌గ‌న్ ఆయ‌న‌ను ప‌ద‌విలో నుంచి తొల‌గించార‌న్నారు. చంద్ర‌బాబుకు భ‌క్తి ఉంటే బీఆర్ నాయుడిని వెంట‌నే భ‌ర్త‌ర‌ఫ్ చేయాలని భూమ‌న (Bhumana Karunakar) అన్నారు .

Read Also: ఆ వీడియోలపై టీటీడీ చైర్మన్ స్పందన​.. ఏమన్నారంటే !

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!