కలం, వెబ్ డెస్క్: తెలంగాణ బడ్జెట్(Telangana budget 2026)లో విద్యార్థులకు భట్టి శుభవార్త చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రకటించారు. ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2000 స్కాలర్‌షిప్ అందిస్తామని తెలిపారు. అటు గత ప్రభుత్వంలో TGPSC నవ్వుల పాలైందని భట్టి తెలిపారు. ఇప్పటివరకు 67వేల మందికి నియామక పత్రాలు అందించామని వెల్లడించారు. సివిల్స్ రాసే విద్యార్థులకు ఆర్థికసాయం అందించామన్న ఆయన.. 202 మందికి సింగరేణి సంస్థ ఒక్కొక్కరి రూ.లక్ష అందించిందని చెప్పుకొచ్చారు.
Read Also: సోషల్ మీడియాలో సైలెంట్ అవుతున్న యువత.. కారణమిదే !
Follow Us On: Sharechat

