Mobile Popup Ad
Mobile Popup Ad

ఎగ్జామ్స్ ఒత్తిడితో టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

కలం/ఖమ్మం బ్యూరో : పరీక్షల ఒత్తిడితో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం  (Bhadradri Kothagudem) జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన రితీష్ ఎగ్జామ్స్ లో పాస్ అవుతానో లేదో అనే టెన్షన్ తో శుక్రవారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడని తల్లి మౌనిక వివరించింది. కొత్తగూడెం పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ లో అప్పం రితీష్ (16) టెన్త్ చదువుతున్నాడు.

కొద్దిరోజులుగా తోటి విద్యార్థులతో గొడవలు అవుతుండటంతో రితీష్ ను భజన మందిరం దగ్గరలోని శ్రీ చైతన్య బ్రాంచ్ కి యాజమాన్యం ట్రాన్సఫర్ చేసింది. కొత్త బ్రాంచ్ కు వెళ్లడం, మరో పక్క ఎగ్జామ్స్ కూడా సమీపించడంతో ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుడి తల్లి మౌనిక కు భర్త లేకపోవడంతో బట్టల మిషన్ కుట్టుకుంటూ కొడుకుని చదివిస్తుంది. ప్రయోజకుడు అవుతాడనుకున్న కొడుకు చనిపోవడంతో ఆ తల్లి శోక సంద్రంలో మునిగిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>