Mobile Popup Ad
Mobile Popup Ad

చెరువులు, కుంటలను కాపాడుకుందాం.. హన్మకొండ కలెక్టర్ పిలుపు

కలం, వరంగల్ బ్యూరో: చెరువులు (Lakes), కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హన్మకొండ (Hanamkonda) జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మినీ సమావేశమందిరంలో ఇరిగేషన్, రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ, ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నగర పరిధిలోని నీటి వనరులైన చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముందస్తుగా నీటి నాణ్యత, కాలుష్య మూలాలు, సిల్ట్ పేరుకుపోవడం, జీవ వైవిధ్యాన్ని పరిశీలించి దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలన్నారు.

మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చెరువులోకి రాకుండా ఇంటర్‌సెప్షన్, డైవర్షన్ డ్రెయిన్లు, సీవేజ్ నెట్‌వర్క్, ఎస్టీపీల ఏర్పాటు ద్వారా నియంత్రించవచ్చని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కుడా సీపీవో అజిత్ రెడ్డి, అదనపు కలెక్టర్ రవి, బల్దియా సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>