ప్రశాంతంగా భద్రాచల దేవస్థాన వైదిక పోస్టుల భర్తీ ప్రక్రియ!

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం (Bhadrachalam Temple)లో ఖాళీగా ఉన్న వివిధ హోదాలలోని మతపర (వైదిక) పోస్టుల భర్తీ ప్రక్రియ శనివారం అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసింది. దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నియామక పరీక్షలను నిర్వహించారు. ​ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులందరికీ హైదరాబాద్‌ కాచిగూడలోని ‘తుల్జా భవన్ ధర్మశాల’ నందు రాత , మౌఖిక (ఇంటర్వ్యూ) పరీక్షలను వైభవంగా నిర్వహించారు.

​దేవాదాయ శాఖ అదనపు కమీషనర్ సమక్షంలో, చీఫ్ ఎగ్జామినర్ ఆయా పోస్టుల ప్రత్యేక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అభ్యర్థుల ప్రతిభను నిష్పక్షపాతంగా పరిశీలించారు. మతపరమైన ఆచారాలు, శాస్త్రాలపై అభ్యర్థులకున్న పట్టును పరీక్షించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు గానీ, వివాదాలకు గానీ తావులేకుండా ఈ భర్తీ కార్యక్రమం అంతా అత్యంత పారదర్శకంగా, సజావుగా సాగడంతో పాటు, నియామక ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగియడం పట్ల అటు అధికారులు, ఇటు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>