Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాచలం రాములోరి ఆదాయం ఎంతో తెలుసా!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) ఆలయానికి భారీగా ఆదాయం (Income) సమకూరింది. 2025-26 సంవత్సరానికి భద్రాచలం రాములోరి ఆదాయం సుమారు రూ. 83.76 కోట్లు అని ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ మార్గాల్లో భద్రాచలం ఆలయానికి వచ్చిన ఆదాయ వివరాలు గమనిస్తే.. గోశాల ద్వారా రూ.42.35 లక్షల ఆదాయం, అన్నదానం కోసం రూ.27.34 కోట్ల ఆదాయం విరాళాల రూపంలో అందింది. మిగతా ఆదాయం హుండీ ద్వారా వచ్చిందని అధికారులు వివరాలు వెల్లడించారు. ఇందులో గోశాల నిర్వహణకు అయిన ఖర్చు రూ.63.59లక్షలు కాగా, అన్నదానం కోసం రూ.27.17 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం రూ.83.06కోట్లు ఖర్చు చేశారు. కాగా గత సంవత్సరం రూ.73.20 కోట్లు ఆదాయం రాగా, అందులో 71.93 కోట్లు ఖర్చు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>