భద్రాచలంలో చారిత్రాత్మక ఘట్టం.. 54 ఏళ్ల తరువాత!

కలం, ఖమ్మం బ్యూరో: ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో ఆదివారం చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. బేడా మండపం నుంచి ప్రస్తుతం ఉన్న ఉత్తర ద్వారం ముందు వరకు ఆలయాన్ని విస్తరించాలని నిర్ణయించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం రెండు ప్రాకారాలుగా మారనుండటంతో సంబంధించిన పనులను వేగవంతం చేశారు.

భక్తులు లేని సమయంలో..

​ఈ మహాత్కార్యంలో భాగంగా 54 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఆలయ ఉత్తర ద్వారాన్ని తొలగించారు. ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ లేని సమయంలో క్రేన్ల సహాయంతో ఈ ఉత్తర ద్వారాల తొలగింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు.

రానున్న రోజుల్లో ఈ ఉత్తర భాగంలో భారీ నిర్మాణాలను చేపట్టాల్సి ఉన్నందున, గత శుక్రవారమే భూసార పరీక్షలు కూడా నిర్వహించారు.

డిసెంబర్ లోపే పూర్తి చేసేలా..

​ఈ ఏడాది డిసెంబరు 10 నుంచి 30వ తేదీ వరకు ఆలయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈలోపే ఉత్తర వైపున చేపట్టే విస్తరణ పనులను పూర్తి చేయాలని మంత్రులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కాంట్రాక్టరుని ఆదేశించారు. నిర్ణీత సమయానికి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నందున పనులను మరింత వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>