గంజాయి స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

కలం, ఖమ్మం బ్యూరో: బైక్‌లపై గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని స్మగ్లింగ్ (Ganja Smugglers) చేస్తున్న నలుగురు నిందితులు సోమవారం భద్రాచలం వద్ద ఎక్సైజ్ పోలీసులకు (Bhadrachalam police) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూనవరం రోడ్డు మార్గంలో ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనాలపై గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా, నిఘా పెట్టిన పోలీసులు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

​ఎక్సైజ్ ఎస్ఐ శ్రీహరి రావు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల వద్ద నుంచి 13.9 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు స్మగ్లింగ్‌కు వినియోగించిన రెండు టూ వీలర్లు, నాలుగు సెల్ ఫోన్లను సీజ్ చేశామన్నారు. పట్టుబడిన గంజాయి, ఇతర వస్తువుల మొత్తం విలువ సుమారు 9.05 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎస్ఐ వెల్లడించారు. సమాజానికి వినాశకరంగా మారిన మత్తుమందుల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మీ ప్రాంతంలో ఎక్కడైనా మత్తుమందులకు సంబంధించిన సమాచారం, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ప్రజలను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>