కలం, వెబ్ డెస్క్: బెంగళూరులోని (Bengaluru) కేఆర్ పురం పరిధిలో జరిగిన హత్యల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితురాలు 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శ్వేతను కేవలం 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. హత్యలు జరిగిన వెంటనే బెంగళూరు నుంచి పరారైన ఆమె, పోలీసుల కళ్లు గప్పి పలు ప్రాంతాలు తిరిగినట్లు సమాచారం. సాంకేతిక నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు ఆమె కదలికలను కనిపెట్టి పుదుచ్చేరిలో అరెస్ట్ చేశాయి. తన తల్లిదండ్రులతో కొంతకాలంగా ఉన్న కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమని శ్వేత అంగీకరించినట్లు తెలుస్తోంది. తన ప్రియుడితో ఉన్న రిలేషన్‌ను తల్లిదండ్రులు అంగీకరించలేదని తెలిపింది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోమసుందర్, ఆయన భార్య ముత్తులక్ష్మి, చిన్న కుమార్తె సుప్రియ ఈ దారుణ హత్యకు (Murder) గురైన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి హత్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల మొబైల్ రికార్డులు, డిజిటల్ ఆధారాలు, ప్రయాణ వివరాల ఆధారంగా కీలక సాక్ష్యాలు సేకరించారు. కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రెండో నిందితుడైన శ్వేత ప్రియుడు కెన్నెత్ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ హత్య ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

