కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో భారీ వర్షం కురిసింది. కాసేపటి క్రితం నగరంలో ఆకస్మిక వర్షం పడింది. వర్షం ధాటికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు, వీధులు వర్షపు నీటిలో మునిగిపోయాయి. దీంతో రహదారులన్నీ జలమయ్యం అయ్యాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలోనే నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులో వర్షంకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
కాగా, ఇటీవల బెంగళూరులో (Bengaluru) కురిసిన భారీ వడగళ్ల వాన కారణంగా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు దశాబ్దాలలో బెంగళూరులో సంభవించిన అత్యంత ఘోరమైన వర్ష సంబంధిత ప్రమాదంగా దీనిని పేర్కొన్నారు. ముఖ్యంగా భారీ వర్షం ధాటికి గోడ కూలి ఏడుగురు మరణించారు. తాజాగా ఆకస్మికంగా భారీ వర్షం రావడంతో బెంగళూరు వాసులు కాసేపు భయబ్రాంతులకు గురయ్యారు.
Read Also: బండి భగీరథ్ వ్యవహారం.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్
Follow Us On: WhatsApp

