Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం రేవంత్‌ను క‌లిసిన బెల్లంకొడ ఫ్యామిలీ

క‌లం వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ బెల్లంకొండ సురేశ్‌ (Bellamkonda Suresh) కుటుంబం నేడు ఉద‌యం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని క‌లిసింది. బెల్లంకొండ సురేశ్ కొడుకు, హీరో శ్రీనివాస్ వివాహం సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వివాహ ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా బెల్లంకొండ సురేశ్‌, ఆయ‌న భార్య‌, ఇద్ద‌రు కొడుకులు సీఎం రేవంత్‌ను పెళ్లికి రావాల‌ని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి బెల్లంకొండ శ్రీనివాస్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇటీవ‌లె శ్రీనివాస్‌కు క‌వ్యారెడ్డితో నిశ్చితార్థం జ‌రిగింది. తిరుప‌తిలో ఈ నెల 29న వీరి వివాహం జ‌రుగ‌నుంది. ఇప్ప‌టికే శ్రీనివాస్ ప‌లువురు రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖుల‌కు ఆహ్వాన ప‌త్రిక‌లు అంద‌జేశారు. చిరంజీవి, నాగార్జున‌ల‌కు ఆహ్వాన ప‌త్రిక‌లు ఇచ్చిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>