Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమ‌ల‌లో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. హాజ‌రైన సినీ, రాజ‌కీయ ప్రముఖులు

క‌లం, వెబ్‌డెస్క్‌: టాలీవుడ్‌లో మ‌రో హీరో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేశాడు. ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ త‌న‌యుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) పెళ్లి తిరుమ‌ల‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఘ‌నంగా జ‌రిగింది. బుధ‌వారం రాత్రి 11.05 గంట‌ల‌కు శ్రీనివాస్ కావ్య మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. ఈ పెళ్లి వేడుక‌కు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి, టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు. మే 1న హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ వేడ‌క‌కు భారీ ఎత్తున సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. ఇందు కోసం ఇప్ప‌టికే అంద‌రికీ బెల్లంకొండ ఫ్యామిలీ స్వ‌యంగా ఆహ్వాన ప‌త్రిక‌లు అంద‌జేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>