కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో మరో హీరో బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. సినీ హీరో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ఎంగేజ్‌మెంట్ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ లగ్జరీ ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక నిర్వహించారు. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితులు, సినీ పరిశ్రమ ప్రముఖుల మధ్య కావ్యారెడ్డి చేతికి శ్రీనివాస్ ఉంగరం తొడిగాడు. ఏప్రిల్ 29న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీనివాస్, కావ్యరెడ్డి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 8న ఈ జంట ప్రీ ఎంగేజ్‌మెంట్ వేడుక జరుపుకొన్నారు. ఈ వేడుకకు పలువురు బంధువులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

