Mobile Popup Ad
Mobile Popup Ad

ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

కలం, ఆలేరు : ఆలేరులో ముప్పై ఏళ్ళ తరువాత కాంగ్రెస్ జెండా ఎగురవేయబోతున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) ధీమా వ్యక్తం చేశారు. ఆలేరు పట్టణంలోని 1వ వార్డులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి చింతల ఫణి సునీతా శ్రీనివాస్ రెడ్డి, 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జూకంటి సంపత్, 10వ వార్డు అభ్యర్థి మల్లెల సరితా శ్రీకాంత్, 8వ వార్డు అభ్యర్థి పాము అనితా కు మద్దతుగా బుధవారం రోజున ప్రచారం నిర్వహించారు.

ఇంటింటికీ తిరిగి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా విలేకరుల తో మాట్లాడుతూ.. ఆలేరు పట్టణం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఆలేరు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పూర్తవుతుందని, త్వరలోనే ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తానని ఆయన (Beerla Ilaiah) హామీ ఇచ్చారు.

ఆలేరు మున్సిపల్ లో కాంగ్రెస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే కొత్త మున్సిపల్ భవనం పాత ఆఫీస్ ఎక్కడైతే ఉందొ అక్కడే కొత్త భవనాన్ని నిర్మించుకుందామన్నారు. ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు ఎజాజ్, మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరాజు, మాజీ ఎంపీపీలు అశోక్, సాగర్ రెడ్డి, చీర శ్రీశైలం, మాజీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.

Read Also: ఫిబ్రవరి వచ్చింది.. రైతుబంధు ఏది : హరీష్‌ రావు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>