కులగణనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన బీసీ సమాజ్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar)  జిల్లాలో జనగణనలో బీసీ కులగణన చేపట్టవచ్చని సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పును బీసీ సమాజ్ (BC Samaaj) నేతలు స్వాగతించారు. ఈ తీర్పు కులగణన వ్యతిరేకులకు చెంపపెట్టులాంటిదని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్(Srinivas Sagar) అన్నారు. గురువారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీసీ సమాజ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కుటుంబాల లెక్కింపు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ జనాభా లెక్కలు తేల్చాలని, జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు దక్కాలని ఆయన పేర్కొన్నారు.

సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి సమగ్ర కులగణన అవసరమని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేయడం స్వాగతించదగిన పరిణామమని తెలిపారు. బీసీ సమాజాలు చేసిన పోరాట ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందని ఆయన అన్నారు. కులగణనపై ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకుండా బీసీలను మోసం చేయాలని చూసిందని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న కుటుంబాల లెక్కింపులోనే బీసీ గణనను కూడా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ యూత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పాలమూరు వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు బోయ నరసింహ, జిల్లా కార్యదర్శి అశ్విని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>