కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బత్తుల లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. బత్తుల లక్ష్మీనారాయణ గతంలో బీజేపీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, చొప్పదండి మండలం గుమ్లాపూర్ ఎంపీటీసీగా సేవలందించారు. ఈ సందర్భంగా బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో బీజేపీ, ఎస్సీ మోర్చా బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు. కరీంనగర్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్, రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

