కలం, వెబ్ డెస్క్: హైడ్రాను రద్దు చేయాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) స్పష్టం చేశారు. అప్పుడే పేదలు ప్రశాంతంగా ఉంటారని వ్యాఖ్యానించారు. హైడ్రా వచ్చినప్పటి నుంచి పేదల ఇళ్లను టార్గ్ చేస్తూ వస్తోందన్నారు. అనవసరంగా రంగనాథ్‌ను బలిపశువును చేశారని.. అసలు దోషి సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. 63 సార్లు కోర్ట్ ధిక్కరణకు పాల్పడటం సామాన్యమైన విషయం కాదన్నారు.
ఎంఐఎం కనుసన్నల్లో..
హైడ్రా ముందు నుంచి ఎంఐఎం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని రాంచందర్ రావు ఆరోపించారు. ఎందుకు ఎంఐఎం నేతల కాలేజీల జోలికి హైడ్రా వెళ్లలేదని ప్రశ్నించారు. హైకోర్ట్ తీర్పు సీఎం రేవంత్ రెడ్డి చెంపపెట్టు లాంటిదని ఎద్దేవా చేశారు. ఇకనైనా పేదల జోలికి వెళ్లడం మానుకోవాలని సూచించారు.

