పెద్ది సుదర్శన్​ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్

కలం, వెబ్​ డెస్క్​ : గుండె పోటుకు గురై సికింద్రబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డిని మాజీ సీఎం, బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ది ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఆయన కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. కేసీఆర్​ వెంట మాజీ మంత్రులు హరీశ్​ రావు, వేముల ప్రశాంత్​ రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.

కాగా, ఆదివారం హన్మకొండలో తన నివాసంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్​ రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆయన్ను గ్రీన్​ ఛానల్​ ద్వారా యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>