నేల‌పైనే బ‌తుక‌మ్మ‌ల నిమ‌జ్జ‌నం!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎల్ నినో ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో నెల‌కొన్న క‌రువు ప‌రిస్థితులు బ‌తుక‌మ్మ‌ (Bathukamma)కు గండంగా మారాయి. పేరుకు వ‌ర్షాకాలం అయినా ఎల్ నినో ప్ర‌భావంతో ఈ ఏడాది అస‌లు వాన‌లు ప‌డిందేలేదు. దీంతో కొన్ని ఊర్ల‌లో చెరువుల్లో చుక్క నీరు లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఈ నీటి కరువుతో రైతులే ఇబ్బంది పడగా తాజాగా బ‌తుక‌మ్మ‌ల నిమ‌జ్జ‌నం కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో జ‌నగామ (Jangaon) ప‌ట్ట‌ణంలో మ‌హిళ‌లు నేల‌పైనే బ‌తుక‌మ్మ‌ల‌ను వ‌దిలి వెళ్లారు.

తెలంగాణ వ్యాప్తంగా శ‌నివారం నుంచి బ‌తుక‌మ్మ సంబ‌రాలు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఎంగిలి పూల బ‌తుక‌మ్మ‌ను పుర‌స్క‌రించుకొని ఆడ‌బిడ్డ‌లు తీరొక్క పూల‌తో బ‌తుక‌మ్మ‌లు పేర్చి ఆడిపాడారు. జ‌న‌గామలో కూడా బ‌తుక‌మ్మ‌ వేడుక‌లు వైభ‌వంగా జ‌రిగాయి. బ‌తుక‌మ్మ నిమ‌జ్జ‌నం చేసేందుకు మాత్రం ఎక్క‌డా నీటి వ‌స‌తి లేదు. స్థానిక రంగ‌ప్ప చెరువు వ‌ద్ద‌కు వెళ్లిన మ‌హిళ‌ల‌కు తీవ్ర నిరాశ మిగిలింది. చెరువులో ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. ఇక ఏం చేయాలో అర్థం కాక బ‌తుక‌మ్మ‌ల‌ను ఖాళీగా ఉన్న చెరువులో నేల పైనే పెట్టేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. క‌నీసం స‌ద్దుల బ‌తుక‌మ్మ (Bathukamma) వ‌ర‌కైనా ప్ర‌భుత్వం తాత్కాలిక ఏర్పాట్లు చేయాల‌ని మ‌హిళ‌లు కోరుతున్నారు.

Also Read : ఢిల్లీలో CJP కీలక నేతల విడుదల.. కాసేపట్లో ప్రెస్‌మీట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>