వైద్య విద్యార్థుల భవిష్యత్తుపై కలెక్టర్ దిశానిర్దేశం

కలం, నిర్మల్ : ప్రభుత్వ వైద్య కళాశాలలో (Govt Medical College) విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాలు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అవసరమైన ప్రాక్టికల్ శిక్షణ అందించినప్పుడే వారి సామర్థ్యాలు పెరుగుతాయని, తద్వారా వారు మంచి వైద్యులుగా తీర్చిదిద్దబడతారని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

వైద్య కళాశాలలో విద్యార్థుల సంఖ్య, వారి విద్యా సంబంధిత అంశాలపై అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు నిర్దేశిత పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అలాగే విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ రాజేందర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శారద, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, డీసీహెచ్‌ఓ కాశీనాథ్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>