మహిళలదే సమాజంలో కీలక పాత్ర: కలెక్టర్ రాజర్షిషా

కలం, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల పాఠశాలలో ఎస్సీ, బీసీ, పాఠశాల విద్యా, ఇంటర్మీడియట్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.

కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. పూలను దైవంగా భావించి పూజించే అద్భుతమైన సంస్కృతి మన బతుకమ్మ పండుగ సొంతమన్నారు. సమాజంలో కుటుంబ నిర్మాణం నుంచి ప్రతి రంగంలోనూ మహిళలదే కీలక పాత్ర అని, తల్లిగా, బిడ్డగా వారు నిర్వహించే బాధ్యతలు అమూల్యమైనవని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో సాంస్కృతిక వేడుకలను మున్ముందు మరింత ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మహిళలతో కలిసి అతిథులు బతుకమ్మ ఆడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>