బాసర ట్రిపుల్ ఐటీలో ఉరివేసుకొని విద్యార్థి బలవన్మరణం

కలం, బాసర : బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (Basara IIIT)లో విషాదం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే… సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన చల్ల సంపత్ (19) ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం రాత్రి గోదావరి బాలుర వసతి గృహంలోని 206వ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>