కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో సయ్యద్‌రాజా నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే సుశీల్ సింగ్ (MLA Sushil Singh) కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోకి ఒక తెల్లటి స్కార్పియో వాహనం అకస్మాత్తుగా దూసుకొచ్చి వరుసగా పలు వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని మూడు వాహనాలు దెబ్బతిన్నాయి.
ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే సుశీల్ సింగ్ స్పందిస్తూ, తన వాహనం ముందు సుమారు ఐదు, వెనుక పదిహేను వాహనాలు ఉన్నాయని తెలిపారు. వెనుక వస్తున్న వాహనం ప్రమాదానికి గురవ్వగా, తన వాహనం కూడా బోల్తా పడిందని ఆయన వివరించారు. ప్రమాదానికి కారణమైన స్కార్పియో తన వాహనాన్ని ఓవర్టేక్ చేసి, ముందున్న మరో వాహనాన్ని కూడా ఢీకొట్టిందని చెప్పారు.
ముందున్న వాహనాల్లోని సిబ్బంది వారిని అడ్డుకుని ప్రశ్నించగా, తాము స్థానికులమని వారు చెప్పారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే వారు ఎలాంటి మత్తు పదార్థాలు సేవించినట్లు కనిపించలేదని, అయినప్పటికీ కావాలనే నాలుగు వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేయడం వెనుక ఏదో కుట్ర ఉన్నట్లు అనుమానంగా ఉందని సుశీల్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

