నేడు ఏపీ సచివాలయంలో కీలక సమావేశాలు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి, రాజధాని అమరావతి అభివృద్ధికి మరింత వేగం పెంచే దిశగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేడు రెండు అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు. సచివాలయం వేదికగా జరగనున్న ఈ భేటీలలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే నూతన పెట్టుబడులు, రాజధాని మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

ఇందులో భాగంగా ఉదయం 11:00 గంటలకు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తయారీ, ఐటీ, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది.

అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతిలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ పనుల పురోగతిని సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. దీనితో పాటు రాజధాని ప్రాంతంలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, మౌలిక వసతుల విస్తరణ, వివిధ సంస్థలకు భూకేటాయింపులు వంటి కీలక అంశాలపై సీఆర్డీఏ అధికారులు, మంత్రులతో చర్చించి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>