Mobile Popup Ad
Mobile Popup Ad

రాబోయే రోజుల్లో కరీంనగర్ రూపురేఖలు మారుస్తా: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రం నుండి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు భారీ ఎత్తున నిధులు వస్తున్నందున రాబోయే రోజుల్లో కరీంనగర్ రూపురేఖలే మారడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. అభివృద్ధిలో కరీంనగర్ ను రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈరోజు ఉదయం కరీంనగర్ లోని జ్యోతినగర్ లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.67 లక్షల సాధారణ నిధులతో నిర్మించిన డ్రెయిన్ పైప్ లైన్, సీసీ రోడ్డును కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావుతోపాటు పలువురు కార్పొరేటర్లు, బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగించిన నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ ను అభివ్రుద్ధి చేయాలని కసితో పనిచేస్తున్నా. అందులో భాగంగా కేంద్ర పెద్దలను ఒప్పించి యూసీఎఫ్ జాబితాలో కరీంనగర్ ను చేర్చించాను. ఫలితంగా కేంద్రం నుండి రూ.840 కోట్లు నిధులు తీసుకొచ్చిన. యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ కార్పొరేషన్ రూపురేఖలే మార్చబోతున్నాం. డంపింగ్ యార్డు కోసం కూడా రూ.80 కోట్లు విడుదలయ్యాయి. నిధుల్లేక గతంలో కరీంనగర్ కార్పొరేటర్లు పడ్డ కష్టాలు నాకు తెలుసు. ఈసారి పుష్కలంగా నిధులొస్తున్నాయి…గల్లా ఎగరేసి అభివ్రుద్ది పనులు చేసుకోవచ్చు. గతంలోనూ రూ.900 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసినం. అమ్రుత్ 1, 2 ద్వారా రూ.277 కోట్లు ఖర్చు చేసినం. శివారు ప్రాంతాలను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం.

కరీంనగర్ సిటీలో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తా. అంతిమంగా రాష్ట్రంలోనే కరేంనగర్ కార్పొరేషన్ ను మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతా.’’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ది కోసం గత ఏడేళ్లలో రూ.22 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ‘‘శాతవాహన కాలేజీకి 12బి హోదా తీసుకొచ్చిన. లా కాలేజీ మంజూరు చేయించిన. ఎస్సారార్ కాలేజీకి అటానమస్ హోదా తెచ్చిన. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం అభివ్రుద్ధికి నిధులు తెచ్చిన. జమ్మికుంట స్టేడియం నిర్మాణం కోసం నిధులు తెచ్చిన. సీఎస్సార్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఎక్విప్ మెంట్స్ అందించిన. ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్ధులందరికీ ఉచితంగా సైకిళ్లు అందించిన. త్వరలోనే మళ్లీ టెన్త్ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందిస్తా.’’అని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>