కలం, వెబ్ డెస్క్: రాజమండ్రి (Rajahmundry) కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామలక్ష్మి అనే వృద్ధురాలు నేడు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. గత నెల 16 నుంచి రామలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మరో ఐదుగురికి చికిత్స కొనసాగుతోంది. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. అందరికీ వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

