Mobile Popup Ad
Mobile Popup Ad

బండి భగీరథ్ కు ఊరట.. కోర్టు కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : పోక్సో కేసులో (POCSO Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ (Bandi Bhagirath)కు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన మల్కాజ్‌గిరి కోర్టు భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నెల రోజుల‌కు పైగా చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు ఎట్టకేలకు న్యాయస్థానం నుంచి బెయిల్ లభించింది.

గతంలో భగీరథ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించినప్పటికీ, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మల్కాజ్‌గిరి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలూ రాకపోవడంతో, ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం బండి భగీరథ్‌ (Bandi Bhagirath)కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: సిరిసిల్ల సీట్.. పెరుగుతున్న పొలిటికల్ హీట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>