కలం, వెబ్ డెస్క్ : భారత రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. స్వదేశీ సాంకేతికతతో అత్యాధునిక రక్షణ సామర్థ్యాలతో రూపొందిన యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ (INS Mahendragiri) అధికారికంగా భారత నౌకాదళంలోకి చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ యుద్ధనౌకను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.
ప్రాజెక్ట్ 17A కింద పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆరవ స్టీల్త్ ఫ్రిగేట్ యుద్ధనౌక ఇది. ఇకపై ఇది ఇండియన్ నేవీకి చెందిన తూర్పు నౌకాదళం (ఈస్టర్న్ నావల్ కమాండ్) పరిధిలో సేవలు అందించనుంది. రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న ‘ఆత్మనిర్భరత’కు, స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణ సామర్థ్యానికి ఈ మైలురాయి నిదర్శనంగా నిలిచింది. ఈ అత్యాధునిక యుద్ధనౌక (INS Mahendragiri) చేరికతో శత్రుదేశాల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు భారత జలాల్లో నౌకాదళ బలం మరింత పెరగనుంది.
Read Also: ఐఆర్సీటీసీ గుడ్న్యూస్: ఇక చిటికెలో రైలు టికెట్!
Follow Us On : WhatsApp

