పోషణ భారమై.. శిశు విక్రయం

కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామంలో శిశు విక్రయం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన ఎరుకల సాయిలు కూతురు మమతకు కౌడిపల్లి గ్రామానికి చెందిన చిన్నతో పెళ్లి జరిపించారు. 2024 సంవత్సరంలో చిన్న మృతి చెందాడు. అప్పటినుంచి మమత ఉప్పు లింగాపూర్ గ్రామంలో తన తల్లిదండ్రుల వద్ద జీవనం కొనసాగిస్తుంది. ఆమె గర్భం దాల్చి ఏప్రిల్ 17వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పోషణకు భారం అవుతుందనే కారణంతో క మగ శిశువును 25 రోజుల క్రితం అమ్ముకున్నారు. శిశు విక్రయం గురించి తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు ఉప్పు లింగాపూర్ గ్రామంలో విచారణ చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>