కరీంనగర్‌లో బాల్య వివాహాల నివారణపై అవగాహన

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో చురుగ్గా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 39వ డివిజన్‌లో బాల్య వివాహాల నివారణపై కార్పొరేటర్ మాసం గణేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ మాసం గణేష్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల వలన ఆడపిల్లలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని వివరించారు. 1098 ఛైల్డ్ హెల్ప్ లైన్ మెంబెర్ సాయి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు జరుగుతుంటే.. తమకు సమాచారం అందించాలని కోరారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ అరుణ మాట్లాడుతూ.. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని, తద్వారా ఆరోగ్య సమాజం తయారవుతుందన్నారు. వార్డ్ ఆఫీసర్ చంద్రహాస్, సతీష్, స్వప్న, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం, భారతరత్న, శ్రీనిధి, మహాత్మ మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ చీరలను కార్పొరేటర్ మాసం గణేష్ పంపిణీ చేశారు. సీవో సునీత, ఆర్‌పీ మానుకోట సునీత, రమ, రాధా , లక్ష్మీ శారద పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>