బంద్‌కు ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపు

కలం, నిజామాబాద్: ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపు బంద్‌కు పిలుపునిచ్చింది. ఆటో డ్రైవర్ల జేఏసీ (Auto Drivers JAC) ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి జరిగే ఆటో క్యాబ్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిరవధిక బంద్ పోస్టర్లను నిజామాబాద్‌లోని కోటగల్లీ ఎన్ఆర్ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి, బీఆర్టియూ, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్టియూ, యూటీయూసీ, టీఆర్టియూ అనుబంధ ఆటో కార్మిక సంఘాల బాధ్యులు హన్మండ్లు, షాదుల్లా, ఉద్ధవ్, గంగాధర్, సుధాకర్, శివకుమార్, రాములు, శ్రీనివాస్‌లు మాట్లాడారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి..

ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలను ఇవ్వాలనే ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఓలా, ఉబర్, రాపిడో యాప్ లకు బదులుగా ప్రభుత్వమే కొత్త యాప్ ను తీసుకురావాలన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12వేలు ఇవ్వాలన్నారు. రోజువారీగా ప్రజలకు సౌకర్యం కల్పించే ఆటో డ్రైవర్లకు ఈ చలాన్ ల నుంచి మినహాయించాలన్నారు. యాక్సిడెంట్ బీమాను కొనసాగించాలని, 50 సంవత్సరాలు పూర్తయిన డ్రైవర్లకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బంద్ జయప్రదం చేయాలి..

ఈ డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుండి జరిగే ఆటో క్యాబ్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిరవధిక బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో జేఏసీ నాయకులు జబ్బర్, హుస్సేన్, విఠల్, అబ్దుల్, గఫార్, సురేందర్, గణేష్, అక్లక్, ఇమ్రాన్, శ్రీనివాస్, రాజు, కృష్ణ ముజీబ్, ఇర్ఫాన్, రఫీయుద్ధిన్ , నరసయ్య, ప్రభాకర్, నరేష్, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>