పాపన్న గౌడ్‌ ఆశయాలు స్ఫూర్తిదాయ‌కం: కేఆర్ నాగ‌రాజు

కలం, హనుమకొండ: సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ (Sarvai Papanna Goud) సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు (MLA KR Nagaraju) అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాపన్న గౌడ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌లు పాప‌న్న‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పాపన్న గౌడ్‌ అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రవి, కుడా మాజీ చైర్మన్‌ సుందర్‌రాజ్‌ యాదవ్, అధికారులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>