Mobile Popup Ad
Mobile Popup Ad

‘సేవ్ టీఎస్ ఆర్టీసీ’.. సమ్మెకు ఎన్ఆర్ఐల మద్దతు!

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె (TGSRTC Strike) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఆర్టీసీ సమ్మెకు విదేశాల్లో నివసిస్తున్న ఆర్టీసీ కార్మికుల పిల్లలు, ఎన్‌ఆర్ఐ నుంచి మద్దతు లభిస్తుంది. ఆస్ట్రేలియా (Australia)లోని ఎన్ఆర్ఐ (NRIs)లు ‘సేవ్ టీఎస్ ఆర్టీసీ’ అనే ప్లకార్డులు పట్టుకుని సమ్మెకు మద్దతు తెలిపారు. తాము ఆర్టీసీ కార్మికుల పిల్లలం అని, తమ తల్లిదండ్రుల కృషి, సంస్థ సహకారంతోనే ఎన్ఆర్ఐలుగా ఎదిగి, విదేశాల్లో స్థిర పడ్డామని వారు చెప్పుకొచ్చారు. ఎంతో మంది యువత ప్రయోజకులు కావడానికి ఆర్టీసీ సంస్థ కారణం అవుతుందని అన్నారు.

అలాంటి సంస్థను తెలంగాణ ప్రభుత్వం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణా రాష్ట్రం సిద్ధించడంలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమ పాత్ర సైతం ఎంతో ఉందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని, ఆర్టీసీని (TGSRTC) కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

Read Also: కాళేశ్వరం ఎఫెక్ట్ : రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్ హీట్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>