కలం, వెబ్ డెస్క్: పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై (MLA Balaraju) ఓ యువకుడు దాడికి యత్నించడం కలకలం రేపింది. ఇటీవల కాలంలో వంశీ అనే యువకుడు ఎమ్మెల్యే బాలరాజుపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాడు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వంశీని పీఎస్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. ఈ నేపథ్యలో కొందరు వ్యక్తులతో క్యాంప్ ఆఫీస్‌కు వచ్చిన వంశీ.. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించాడు. గన్‌మెన్, సిబ్బంది అప్రమత్తమై వంశీని అడ్డుకున్నారు. అనంతరం జీలుగుమిల్లి పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

