అథ్లెట్ ప్ర‌తిభ వివాదంలో ట్విస్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: బీఆర్ఎస్ హ‌యాంలో వేధింపుల‌కు గురైన‌ట్లు ఆరోపించిన అథ్లెట్ తక్కెడపల్లి ప్ర‌తిభ (Athlete Pratibha) వ్య‌వ‌హారం ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో క్రీడా శాఖ మంత్రి పేషీలో ఉద్యోగి ఆమెను వేధించాడ‌ని, అస‌భ్య‌క‌ర మెసేజ్‌లు పెడుతూ ఇబ్బందుల‌కు గురి చేశాడ‌ని 2023లో ప్ర‌తిభ ఆరోపించారు. ఆ స‌మ‌యంలోనే ఆమె బంధువు ఒక‌రు ఈ విష‌యంలో జోక్యం చేసుకొని స‌ద‌రు ఉద్యోగికి వార్నింగ్ ఇచ్చార‌న్నారు. అలాగే ఆమె కూడా సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డంతో ఈ వ్య‌వ‌హారం ఇంత‌టితో ఆగింద‌ని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాత్రం ఆమెను స్వ‌యంగా క్రీడా శాఖ‌ మంత్రి వేధించాడ‌ని, మంత్రికే తాను వార్నింగ్ ఇచ్చాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ప్ర‌తిభ‌ మాట్లాడిన వీడియోల‌ను బీజేపీ, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. బీఆర్ఎస్ హ‌యాంలో ఆడ‌పిల్ల‌లు, క్రీడాకారిణుల ప‌రిస్థితి ఇదంటూ విమ‌ర్శ‌ల‌కు దిగారు. దీంతో అప్ప‌ట్లో క్రీడా శాఖ మంత్రిగా ప‌ని చేసిన శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) చిక్కుల్లో ప‌డ్డ‌ట్లు అయ్యింది. దీనిపై బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా కూడా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇస్తోంది. ప్ర‌తిభ (Athlete Pratibha) గ‌తంలో మాట్లాడిన మాట‌లు, తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన రెండు వీడియో క్లిప్లింగ్స్ జోడించి వైర‌ల్ చేస్తోంది. అలాగే ప్ర‌తిభ బాబాయి అప్ప‌టి మంత్రి పేషీలో ప‌ని చేసిన ఉద్యోగికి వార్నింగ్ ఇచ్చిన ఆడియో క్లిప్‌ను కూడా సోష‌ల్ మీడియాలో పెట్టారు. ఈ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడే శ్రీనివాస్ గౌడ్ స‌ద‌రు ఉద్యోగిని స‌స్పెండ్ చేశారు.

తాజాగా ప్ర‌తిభ చేసిన వ్యాఖ్య‌లు మ‌ళ్లీ పాత వివాదాన్ని తెర‌పైకి తీసుకొచ్చాయి. ఈ రెండు భిన్న వ్యాఖ్య‌లున్న‌ వీడియోల‌తో నెటిజన్లు అయోమ‌యానికి గుర‌వుతున్నారు. ప్ర‌తిభ మ‌ళ్లీ తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై క్లారిటీ ఇస్తారా? శ్రీనివాస్ గౌడ్ త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఎలా రెస్పాండ్ అవుతారు? అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Also Read : ‘నువ్వు పోతే మీ ఇంటికి ఎవరు దిక్కు?’.. మరో వివాదంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>