కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారంవారి గూడెం కాలనీ (Naramvari Gudem Colony) గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.8,100 నగదు, నాలుగు మోటార్ సైకిళ్లు, అయిదు ఫోన్లు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై యయాతీ రాజు తెలిపారు. జూద కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై స్పష్టం చేశారు.

